తొలి సినిమా ‘బావ’తోనే సిద్దార్థ్ కు లిప్‌లాక్ లాంటి ముద్దు ఇచ్చి… మత్తెక్కించింది ప్రణీత. అయితే ఆ ముద్దులు ఆమె కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు. పవన్ సరసన ’అత్తారింటికి దారేది’ వరకూ ప్రణీత పంట పండలేదు. ఆ సినిమా తరవాత ప్రణీత కెరీర్ ఊపందుకొంది. ఇప్పుడు చేతినిండా కావల్సిన సినిమాలున్నాయి. అందులో ’పాండవులు పాండవులు తుమ్మెద’ ఒకటి. ఈ సినిమాలో మంచు మనోజ్ కు జోడీగా నటించిందీ భామ. ఇందులో ఓ ఘూటైన లిప్ లాక్ ఉంది. ఆ కిస్ చూసి ప్రణీత ఏంటి? ఇలా రెచ్చిపోతోంది..?? అనుకొన్నారంతా. కానీ ప్రణీత మాత్రం అది ముద్దు కాదు మొర్రో అంటోంది. అది కేవలం కెమెరా ట్రిక్ మాత్రమే. తెరపై చూస్తోంది నిజం కాదు – అని సమాధానమిచ్చింది.