దటీజ్ మెగా స్టార్

megastar chiruచిరంజీవికి మెగా స్టార్ కిరీటం ఉత్తినే దక్కలేదు. అంకిత భావం, క్రమశిక్షణ, వృత్తి మీద వున్న శ్రద్ధ ఈ స్థాయికి చేర్చాయి. ఓ మాట ఇచ్చాడంటే దానికి కట్టుబడి వుండే తత్వం… ఆయన్ని సినీ రంగంలో నెంబర్ వన్ చేసింది. ఇప్పుడాయన రాజకీయాల్లో బిజీగా వున్నారు. రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు అభిమానులు చిరు 150వ సినిమా కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారు. అదెప్పుడో తెలీదు గానీ మెగా వాయిస్ వినే అవకాశం మాత్రం దక్కబోతోంది. రచయిత భారవి తొలిసారి మెగా ఫోన్ పట్టి ‘జగద్గురు ఆది శంకర’ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రానికి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. భారవి అంటే చిరుకి ప్రత్యేక అభిమానం. ‘మంజునాధ’ కధని అందించడమే కాకుండా, ఆ సినిమా నిర్మాణ బాధ్యతలు కుడా భుజాన వేసుకున్నారు భారవి. చిరు కెరియర్ లో అదో ఆణిముత్యం గా మిగిలిపోయింది. అలాంటి వ్యక్తికి ఎప్పుడో ఓ సారి చిరు మాట ఇచ్చారు. ‘మీరు చేసే చిత్రానికి నావంతు సాయం అందిస్తానని’. ఆ మాట ఇప్పుడు నిజం చేశారు.

నిత్యం అనేక బరువు బాధ్యతల మధ్య సతమత మవుతున్నా… ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించి… మంగళ వారం మల్లెమాల రికార్డింగ్ థియేటర్ కి చేరుకున్నారు. ‘వస్తున్నా’ అంటూ ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా, ఎలాంటి హంగామా లేకుండా చిరు… రికార్డింగ్ థియేటర్ కి రావడం చిత్ర బృందాన్ని ఆర్చర్య పరిచింది. అంతే కాదు మెగా స్టార్ అయ్యుండి… ఓ సామాన్య ఆర్టిస్ట్ లా డైలాగ్ పేపర్ పట్టుకుని కసరత్తు చేశారు. అందుకోసం రెండు గంటల సమయం కేటాయించారు. ఇంతకీ.. చిరు వాయిస్ వినిపించేది 90 సెకన్లు మాత్రమే. అయినా సరే పర్ఫెక్షన్ కోసం చిరు పడిన తాపత్రయం రికార్డింగ్ థియేటర్ లో వున్న అందరినీ ఆకట్టుకుంది. “ఇదొక్కటే కాదు. ఈ సినిమా కి సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా అందివ్వడానికి నేను సిద్ధం” అని అభయ హస్తం అందించారు. ‘దటీజ్ మెగా స్టార్….’ అని మరో సారి అనిపించుకున్నారు. జై… చిరంజీవ.