Site icon TeluguMirchi.com

ద‌టీజ్‌… మ‌హేష్‌!

mahesh-babuత‌న ద‌గ్గర ప‌నిచేసే సిబ్బంది బాబోగులు చూడ‌డంలో కృష్ణ త‌ర‌వాతే ఎవ‌రైనా. ఏళ్ల త‌ర‌బ‌డి త‌న‌ను న‌మ్ముకొన్న వ్యక్తుల‌ను.. త‌న వాళ్లుగా చూసుకొంటారు. కృష్ణ వ్యక్తిగ‌త‌ మేక‌ప్‌ మెన్‌..కి ఇప్పటికీ నెల నెల జీతం వెళ్తుంటుంది. కృష్ణ సినిమాలు చేయ‌క‌పోయినా స‌రే! ఈ విష‌యంలో తండ్రి ల‌క్షణాల‌ను అక్షరాలా పుణికి పుచ్చుకొన్నాడు మ‌హేష్‌ బాబు. తండ్రిలాగే త‌న సిబ్బంది మంచి చెడుల‌ను ద‌గ్గరుండి గ‌మ‌నిస్తుంటారాయ‌న‌. మ‌హేష్ ద‌గ్గర.. గ‌త కొన్ని సంవ‌త్సరాలుగా ప‌ట్టాభి అనే వ్యక్తి మేక‌ప్‌మేన్‌ గా ప‌నిచేస్తున్నాడు. అత‌ని గృహ ప్రవేశానికి మ‌హేష్ ని ఆహ్వానించాడు. కానీ అదే స‌మ‌యంలో మ‌హేష్ సింగ‌పూర్‌ లో సెల‌వ‌ల‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప‌ట్టాభి కోసం… ఓ రోజు ముందే హైద‌రాబాద్ తిరిగిచ్చాడు. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ప‌ట్టాభి ఇంటికెళ్లి.. ప‌ల‌క‌రించి వ‌చ్చాడు. ఆ ఇంటి వెనుక మ‌హేష్ చేయూత కూడా ఉంది. మ‌హేష్ రాక‌తో అక్కడున్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. అలా.. ద‌టీజ్ మ‌హేష్ అని మ‌రోసారి అనిపించుకొన్నాడు ప్రిన్స్‌.

Exit mobile version