Site icon TeluguMirchi.com

అవి అల్లు అర‌వింద్ డబ్బులేనట !

gouravamగౌర‌వం సినిమాకి ప్రకాష్‌రాజ్ నిర్మాత అనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే…ఆ సినిమా కి డ‌బ్బులు పెట్టింది స్వయంగా అల్లు అర‌విందేన‌ట‌. కొడుకు సినిమా కాబ‌ట్టి… తొలి ప్రాజెక్టు సొంత నిర్మాణ సంస్థలో చేయ‌డం బాగుండ‌ద‌ని, సెంటిమెంట్‌గా కూడా క‌ల‌సి రాద‌ని.. ప్రకాష్‌రాజ్‌కి అప్పగించార‌ట‌. అందుకే ఈ సినిమాని ప్రకాష్‌రాజ్ టేక‌ప్ చేశార‌ని స‌మాచారం. త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన రాధామోహ‌న్‌ని ద‌ర్శకుడిగా రిక‌మెండ్ చేసింది కూడా ప్రకాష్‌రాజేన‌ట‌. వీరిద్దరి గుడ్‌విల్ ఈ సినిమాకి క‌లిసొస్తుంద‌ని అర‌వింద్ ఒకే చెప్పేశార‌ట‌. ఇలా బినామీ పేరుతో సినిమా తీసుకొనే అవ‌స‌రం ఏమొచ్చిందో మరి?

Exit mobile version