Site icon TeluguMirchi.com

థాంక్యూ ఫస్ట్ డే కలెక్షన్స్


నాగ చైతన్య , రాశి ఖన్నా , అవికాగోర్‌, మాళవిక నాయర్‌ హీరో, హీరోయిన్లు గా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించిన చిత్రం థ్యాంక్ యూ. వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న చైతు..ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో నిన్న థాంక్యూ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్సిడ్ టాక్ వచ్చింది. ఈ టాక్ కలెక్షన్ల ఫై దారుణంగా పడింది.

ఫస్ట్ రోజు కలెక్షన్స్ చూస్తే..

నైజాం రూ.72 లక్షలు
సీడెడ్ లో రూ.20 లక్షలు
ఉత్తరాంధ్రలో రూ.22 లక్షలు
ఈస్ట్ రూ.14 లక్షలు
వెస్ట్ రూ.8 లక్షలు
గుంటూరులో రూ.10 లక్షలు
కృష్ణ లో రూ.12 లక్షలు
నెల్లూరులో రూ.7 లక్షలు ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో థాంక్యూ సినిమా రూ.1.65 కోట్ల షేర్ వసూళ్లను 2.70 కోట్ల గ్రాస్ సాధించింది. కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే రూ.6 లక్షలు ఓవర్సీస్ లో రూ.45 లక్షలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా థాంక్యూ సినిమా మొదటి రోజు 2.16 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది. ఇక 3.70 కోట్ల గ్రాస్ దక్కింది.

నాగచైతన్య గత సినిమాల కంటే కూడా థాంక్యూ సినిమా చాలా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకోవడం షాక్ అనే చెప్పాలి. చివరగా వచ్చిన బంగార్రాజు ఫస్ట్ 9 కోట్ల వసూలను అందుకుంది. ఆ సినిమా లో నాగార్జున ఉన్న విషయం తెలిసింది. అలాగే లవ్ స్టోరీ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 7.13 కోట్లను సాధించింది. కానీ ఈ మూవీ మాత్రం దారుణమైన వసూళ్లు రాబట్టడం అందరికి షాక్ కలిగిస్తున్నాయి.

Exit mobile version