Site icon TeluguMirchi.com

దారుణంగా పడిపోయిన థ్యాంక్యూ కలెక్షన్స్

నాగ చైతన్య నటించిన తాజాగా చిత్రం థ్యాంక్యూ డిజాస్టర్ ఖాతాలోకి వెళ్ళినట్లే తెలుస్తుంది. నాగ చైతన్య , రాశి ఖన్నా , అవికాగోర్‌, మాళవిక నాయర్‌ హీరో, హీరోయిన్లు గా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్లో దిల్ రాజు నిర్మించిన చిత్రం థ్యాంక్ యూ. వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న చైతు..ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో థాంక్యూ అంటూ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్సిడ్ టాక్ వచ్చింది. దీంతో రోజు రోజుకు దారుణంగా కలెక్షన్లు పడిపోతున్నాయి. మూడో రోజు నుండి చాలాచోట్ల ప్రేక్షకులు లేక షోస్ రద్దు చేస్తున్నారు.

5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు చూస్తే.. నైజాంలో రూ. 1.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 36 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 60 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 23 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలతో.. రూ. 3.11 కోట్లు షేర్, రూ. 5.30 కోట్లు గ్రాస్ దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.08 షేర్‌తో పాటు రూ. 7.22 కోట్లు గ్రాస్‌ మాత్రమే వచ్చింది. ఈ లెక్కన పూర్తి రన్ లో ఈ సినిమా వల్ల ప్రొడ్యూసర్ కు రూ. 15 కోట్లకు పైగానే నష్టం రావడం ఖాయం అంటున్నారు.

Exit mobile version