Site icon TeluguMirchi.com

ప్రభాస్‌ పెళ్లి విషయమై తమన్నా కూడా చేతులెత్తేసింది

prabhasయంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పెళ్లిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో రకారకాల వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి 2’ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గోంటున్న ప్రభాస్‌కు ఎక్కడకు వెళ్లినా కూడా పెళ్లి గోల తప్పడం లేదు. ఎప్పుడు ఏవో మాటలు చెబుతూ పెళ్లి విషయం చెప్పకుండా ప్రభాస్‌ తప్పించుకుంటున్నాడు. తాజాగా మీడియాతో ముచ్చటించిన ప్రభాస్‌ తన పెళ్లి చేయడం తమన్నా వల్ల కాలేదని నవ్వుతూ చెబుతున్నాడు. అదేంటి తమన్నాకు, ప్రభాస్‌ పెళ్లి సంబంధం ఏంటి అనే సందేహం ఉందా! అదేనండి తమన్నాతో నటించిన బాచిలర్‌ హీరోలందరికి ఆ తదుపరి ఏడాది పెళ్లి అయ్యింది. అయితే ప్రభాస్‌ కూడా తమన్నాతో రెండు సినిమాల్లో నటించాడు.

తమన్నాతో తాను నటించినా కూడా తన పెళ్లి కాలేదని, తమన్నా సెంటిమెంట్‌ కూడా తనపై పని చేయలేదని ప్రభాస్‌ నవ్వుతూ సమాధానం చెప్పాడు. అంతేకాకుండా ఈ విషయంలో తమన్నా సెంటిమెంట్‌ రివర్స్‌ అయ్యి తన పెళ్లి కంటే ముందుగా తమన్నా పెళ్లి అవుతుందేమో అని ప్రభాస్‌ కామెడీలు చేస్తున్నాడు. మొత్తానికి ప్రభాస్‌ పెళ్లి విషయంలో తమన్నా సెంటిమెంట్‌ కూడా పనిచేయలేదు, ప్రభాస్‌ పెళ్లి పట్ల తమన్నా కూడా చేతులెత్తేసింది. ఏది చేస్తే ప్రభాస్‌ పెళ్లి అవుతుందని ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. చాలాకాలంగా ప్రభాస్‌కు తగిన వధువు కోసం గాలింపులు చేపడుతున్నారు. కానీ ప్రభాస్‌ను వరించబోయే ఆ అమ్మాయి ఎక్కడ ఉందో కానీ ఇంకా ఆమె ఆచూకి తెలియడం లేదు.

Exit mobile version