మిల్కీ బ్యూటీ తమన్నా చిన్న పిల్ల అయిపోయింది. స్కూల్ కి వెళుతుంది. ఇదంతా సినిమా కోసం. తమన్నా. సందీప్ కిషన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోన్న విషయం విదితమ ఈ సినిమా షూటింగ్ లండన్‌లో ప్రారంభమయ్యింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ, తమన్నా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలుంచింది. ఆ ఫొటోల్లో తమన్నా స్కూల్ యూనిఫామ్‌లో కన్పించడం ఆసక్తికరంగా వుంది. ఈ ఫోటోలో చలా క్యూట్ గా కనిపించిది తమ్ము లుక్ అలాగే వుంది.
‘ఒరేయ్ పండు’ ఫేం సచిన్ జోషి, పురి అక్షయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ, హిందీ బాషల్లోకీ ఈ సినిమాని డబ్ చేసి విడుదల చేయనున్నారు బాలీవుడ్లో ‘ఫనా’ తదితర చిత్రాల్ని తెరకెక్కించిన కునాల్ కోహ్లీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇది కాకుండా తమన్నా , విక్రం సరసన స్కెచ్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇదీ షూటింగ్ దర్శలోనే వుంది.