Site icon TeluguMirchi.com

‘సాహో’లో ప్రభాస్‌ రొమాన్స్‌… మళ్లీ ఆమెతోనేనా..??

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌ అయ్యాడు. జాతీయ స్థాయిలో హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి 2’ చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చి చరిత్రను తిరగరాస్తుంది. ప్రభాస్‌ ఈ చిత్రం తర్వాత సుజిత్‌ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రంలో నటించనున్నాడు. 150కోట్ల బడ్జెట్‌తో భారీ యాక్షన్‌ లెవల్‌లో హాలివుడ్‌ స్థాయిలో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రం తర్వాత ప్రభాస్‌ చేయబోతున్న చిత్రం ‘సాహో’ కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ప్రభాస్‌ ఒకే చెప్పడంతో కథ మీద అభిమానులకు గట్టిగానే నమ్మకం ఉంది కానీ ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన రొమాన్స్‌ చేసే ఆ హీరోయిన్‌ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ చిత్రంలో ప్రభాస్‌తో రొమాన్స్‌ చేయడానికి పలువురు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలను సంప్రదించారట. అయితే ఇంతవరకు ఎవరు ఫిక్స్‌ కాలేదు. తాజా సమాచారం ప్రకారం ‘సాహో’ చిత్రంలో ప్రభాస్‌తో రొమాన్స్‌ చేసేది మిల్కిబ్యూటి తమన్నా అని ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ వినిపిస్తుంది. ప్రభాస్‌, తమన్నాలు ఇప్పటికే పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరి జోడికి ప్రేక్షకుల నుండి మంచి మార్కులే పడ్డాయి. కానీ ‘బాహుబలి 2’ క్రేజ్‌తో ప్రభాస్‌ ఎక్కడికో వెళ్లిపోయాడు. దాంతో ప్రభాస్‌ చిత్రంలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అయితే బాగుంటుంది అని అభిమానులు ఆశ పడుతున్నారు. చివరకు ‘సాహో’ చిత్రంలో ఎవరు ఫిక్స్‌ అవుతారు అనేది ఇంకా క్లారిటీ లేదు.

Exit mobile version