ఛీ… ఛీ… అదంతా కూడా పుకారే

thamannaమిల్కీబ్యూటి తమన్నాకు ప్రస్తుతం ‘బాహుబలి 2’ తప్పితే తెలుగులో కొత్త ప్రాజెక్ట్‌లు ఏవి లేవు. రేపు విడుదల కాబోతున్న ‘బాహుబలి 2’ చిత్ర ప్రమోషన్‌లో చిత్ర యూనిట్‌ చురుగ్గా పాల్గోంటున్నారు. ఈ చిత్రంలో నటించిన తమన్నా మాత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దాంతో రెండో పార్టులో తమన్నా పాత్రకు పెద్దగా స్కోప్‌ ఉండదు, తమన్నా పాత్ర నిడివి తక్కువ అందుకే ఈ అమ్మడు ప్రమోషన్‌లో పాల్గోనడం లేదు అనే పుకార్లు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ‘బాహుబలి 2’ చిత్రంలో చిన్న పాత్ర చేసిన కూడా అది గొప్ప విషయమే. అలాంటిది తమన్నా ఏదో కారణాల వ్ల ప్రమోషన్‌లో పాల్గోనకపోతే ఆమె పాత్ర నిడివి తక్కువ ఉండడం వల్ల దూరంగా ఉంటుంది అని ప్రచారం చేస్తున్నారు.

ఈ పుకార్లు కాస్త తమన్నా చెవిన పడ్డాయి. దాంతో తమన్నా షాకయ్యి వెంటనే స్పందించింది. ‘బాహుబలి 2’ చిత్రంలో తన పాత్ర కీలకమైనదని, మొదటి పార్టు లాగే రెండో పార్టులో కూడా తన పాత్ర నిడివి ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా క్లైమాక్స్‌లో తమ పాత్ర చాలా కీలకం అని, సినిమా చూసిన వారికి తన పాత్ర ప్రాముఖ్యత తెలుస్తుందని, ఛీ..ఛీ.. నా పాత్ర తక్కువ నిడివి అనేది  పుకారే అని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ‘బాహుబలి 2’ చిత్రం విడుదల తర్వాత అయినా ఈ అమ్మడికి కొత్త అవకాశాలు వస్తాయా లేదా అని అభిమానులు కంగారు పడుతున్నారు.