Site icon TeluguMirchi.com

జీవీ తో తమన్నా ‘100% లవ్‌’

నాగచైతన్య కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘100% లవ్‌’. సుకుమార్ దర్శకత్వంలో వచ్చినీ సినిమా ఘన విజయం సాధించింది. తమన్నా- చైతుల జోడి ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా తమిళ్ లో రీమక్ కానుంది.

ప్రస్తుతం కోలీవుడ్ లో వరుసా సినిమాలతో బిజీగా ఉన్న హీరోల్లో జి.వి ప్రకాశ్‌కుమార్‌ ఒకరు. ఇప్పుడు తెలుగులో ఘన విజయం సాధించిన ‘100% లవ్‌’కి తమిళ్‌ రీమేక్‌గా ఓ సినిమా చేయనున్నుద్. ఈ సినిమా కి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు.

ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం తమన్నాను అనుకుంటున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రటకన రావాల్సి ఉంది. మరో విశేషం ఏమిటంటే.. దర్శకుడు సుకుమార్ పర్యవేక్షణలో ఈ సినిమా తెరక్క్కనుందని టాక్ వినిపిస్తుంది.

Exit mobile version