Site icon TeluguMirchi.com

మెగా చిత్రం నుండి తమన్ అవుట్

thaman
రామ్ చరణ్ ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమాకి సంగీత దర్శకుడు మారాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు తమన్ మధ్యంతరంగా ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం తమన్ కొన్ని పాటల్ని ఇచ్చాడు. దర్శకుడు కృష్ణవంశీతో ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా, ఈ సినిమాకు పని చేయలేనని చెప్పి తమన్ తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ను ను తాజాగా ఈ ప్రాజక్టులోకి తీసుకున్నారని తెలుస్తోంది

Exit mobile version