బాలయ్య కు బాణీలు అందించనున్న తమన్…..

Balayya-Thamanలయన్ సూపర్ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న నందమూరి బాలకృష్ణ..యంగ్ హీరోలకు తనేమే తక్కువకాదు అనట్లు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తన 99 వ సినిమా ఫై అప్పుడే దృష్టి పెట్టినట్లు సమాచారం.

బాలీవుడ్‌లో నిర్మాణ సంస్థ అయిన ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రంను నిర్మించనున్నారు. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరించనున్నారు. మే 29న ఈ సినిమా ముహూర్తం కార్యక్రమాలు జరగనున్నాయి. ‘డిక్టేటర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం జూన్ 12నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

t కోన వెంకట్, గోపీ మోహన్, బీవీఎస్ రవి, శ్రీధర్ శ్రీపాన, డైమండ్ రత్నంలు కలిసి ఈ సినిమా కోసం పనిచేయడం మరో ప్రత్యేకత. బాలయ్య సరసన అంజలి హీరోయిన్‌గా నటిస్తుంది. మొట్ట మొదటిసారిగా తమన్ బాలకృష్ణ 99వ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.