త‌డాఖా… జ‌స్ట్ యావ‌రేజ్ సినిమా! -దాస‌రి

thadakhaసినిమా విజ‌యం సాధిస్తే ప‌రిశ్రమ‌కు పండ‌గ‌లాంటిది. సినిమాకి ప‌నిచేసిన వంద కుటుంబాలు సంతోష‌ప‌డ‌తాయి. దానితో పాటు రాష్ట్రంలో వెయ్యి కుటుంబాలు పండుగ చేసుకొంటాయి.. అంటున్నారు దాస‌రి నారాయ‌ణ రావు. త‌డాఖా అభినంద‌న స‌భ కార్యక్రమానికి ఆయ‌న ముఖ్య అతిథిగా విచ్చేశారు. ”నాకు దిల్ రాజు అంటే ఎంతిష్టమో… బెల్లం కొండ సురేష్ అన్నా అంతే ఇష్టం. ఇద్దరూ క‌థ‌ని న‌మ్ముకొని సినిమాలు తీస్తారు. త‌డాఖా త‌మిళ వెర్షన్ చూశా. బాగా న‌చ్చింది. త‌డాఖా ఇంకా బాగా న‌చ్చింది. సెకండాఫ్‌లో ఆసుప‌త్రి స‌న్నివేశం లేక‌పోతే.. త‌డాఖా జ‌స్ట్ యావ‌రేజ్ సినిమా. అది జోడించి ఈ సినిమాని డాలీ హిట్ చేశాడు. ఈ సినిమా చైతూ ఎందుకు ఒప్పుకొన్నాడా? అనిపించింది. కానీ ఈ సినిమాలో అత‌న్ని చూస్తే… ఇలాంటి ఓ త‌మ్ముడు ఉంటే బాగుండును అనిపిస్తుంద”ని చెప్పారు. ఈ కార్యక్రమంలో వినాయ‌క్‌, నాగ‌చైత‌న్య‌, సునీల్‌, డాలీ, వీర‌భ‌ద్రమ్ బెల్లంకొండ సురేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.