Site icon TeluguMirchi.com

త‌డాఖా సెన్సార్ రిపోర్ట్ ఏమిటి?

 

నాగ‌చైత‌న్యకి మంచి రోజులు వస్తున్నాయా? త‌న ‘త‌డాఖా’ చూపించ‌బోతున్నాడా? త‌డాఖా సెన్సార్ రిపోర్ట్ వింటే అవున‌నే చెప్పాలేమో? ‘త‌డాఖా’కి సోమ‌వారం సెన్సార్ జ‌రిగింది. u/a స‌ర్టిఫికెట్ ల‌భించింది. అయితే సెన్సార్ ఇచ్చిన రిపోర్ట్ మాత్రం పూర్తి పాజిటివ్‌ గా ఉంది. వెట్టై క‌థ‌ను కిషోర్‌… బాగా తెలుగీక‌రించాడ‌నీ, చైత‌న్య‌-సునీల్‌ లు పోటీ ప‌డి న‌టించార‌ని చెబుతున్నారు. డాన్సుల విష‌యంలో సునీల్ ఎప్పటిలానే చెల‌రేగిపోయాడ‌ట‌. సునీల్‌ తో పాటు చైతూ కూడా గుర్తిండిపోయే స్టెప్పులు వేశాడ‌ట‌. న‌టుడిగా కూడా చైత‌న్యకు మంచి మార్కులే ప‌డ‌తాయ‌ట‌. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో ఎక్కడా విసుగురాకుండా ఈసినిమాని తీర్చిదిద్దార‌ట‌. ‘ఈ సినిమా ఫ్లాప్ అయితే మా ఆఫీసుకు వ‌చ్చి దాడి చేసుకోండి..’ అంటూ బెల్లంకొండ సురేష్ ఉత్తినే ఆఫ‌ర్ ఇవ్వలేద‌ని… ఈ సినిమాలో విష‌యం ఉంద‌ని – సెన్సార్ రిపోర్ట్ చెబుతోంది. ఈ యేడాది మ‌రో హిట్ చూడ‌డం గ్యారెంటీ అన్నమాట‌.

 

Exit mobile version