ఈవారం బిగ్‌బాస్‌లో ఎవరికి మూడింది

తెలుగు బిగ్‌బాస్‌ 5 వారాలు పూర్తి చేసుకుని ఆరవ వారంలోకి ఎంటర్‌ అయ్యింది. అయిదవ వారం పూర్తి అయిన తర్వాత అషు రెడ్డి బయటకు వెళ్లిన విషయం తెల్సిందే. అషు ఎలిమినేషన్‌ తర్వాత ఆరవ వారంలో ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు అంటూ ప్రస్తుతం చర్చ మొదలైంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్‌కు నామినేషన్‌ జరిగింది. ఎలిమినేషన్‌లో ఉన్న వారు ఎవరో క్లారిటీ వచ్చేసింది. ఎలిమినేషన్‌ పక్రియ విభిన్నంగా చేసేందుకు బిగ్‌బాస్‌ టీం ప్రయత్నించినా కూడా అది పెద్దగా వర్కౌట్‌ అవ్వలేదు. ఇక బిగ్‌బాస్‌ ఆరవ వారంలో ఎలిమినేషన్స్‌లో ఉన్న వారిలో ఎలిమినేట్‌ అయ్యేది ఎవరు అనే విషయమై చర్చ మొదలైంది.

జంటలుగా నిల్చున్న వారిలోంచి ఒక్కరు చొప్పున నామినేట్‌ చేయగా పునర్నవి, రాహుల్‌, రవికృష్ణ, మహేష్‌, హిమజలు నామినేట్‌ అయ్యారు. నామినేట్‌ కానివారిలోంచి ఒకరిని ఎంపిక చేయాల్సిందిగా కెప్టెన్‌ శివ జ్యోతికి బిగ్‌బాస్‌ సూచించగా ఆమె వరుణ్‌ సందేశ్‌ను నామినేషన్‌లో ఉంచింది. వితికను నామినేట్‌ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ వారంలో వితిక ఎలిమినేట్‌ అయ్యేది. కాని వితిక ఈ వారంలో కూడా నామినేషన్‌ నుండి తప్పించుకుంది. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న ఆరుగురిలో రాహుల్‌ మరియు మహేష్‌ విట్టాలు బలహీనంగా కనిపిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారో వారాంతం వరకు తేలిపోయే అవకాశం ఉంది.