Site icon TeluguMirchi.com

టెంపర్ ను బయపెడుతున్న రిలీజ్ డేట్…

Temper-releaseఎన్టీఆర్ , పూరి కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ మూవీ టెంపర్. మొదటి నుండి కూడా ఈ చిత్రం అనేక రకాల కారణాలతో నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటూ వస్తుంది. తాజాగా మరో ఆసక్తి కరమైన న్యూస్ టెంపర్ యూనిట్ ని ఖంగారు పెడుతుంది.

ఇప్పటికే సంక్రాంతి సీజన్ ను మిస్ చేసుకున్న బండ్ల గణేష్, మళ్లీ ఇంకో తప్పు చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చేనెల 5న రిలీజ్ చేద్దాం అని అనుకున్న షూటింగ్ ఇంకా కొనసాగుతుండడం తో ఫిబ్రవరి 15న రిలీజ్ చేద్దాం అనే ఆలోచనలో బండ్ల గణేష్ ఉన్నాడని వార్త.. ఇదే నిజం అయితే, అదే డేట్ నుండి వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అంతే కాకుండా మర్చి ఫస్ట్ వీక్ నుండి ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ కావడం తో , ఆ టైం లో రిలీజ్ చేస్తే సినిమా కలెక్షన్స్ ఫై తీవ్ర ప్రభావం ఉంటుందని సినీ ప్రముఖులు అబిప్రాయపడుతున్నారు. నిన్న నందమూరి తారకరామారావు వర్దంతి సందర్భంగా టెంపర్ ఆడియో రిలీజ్ చేస్తారని అబిమానులు అనుకున్న అది కూడా వాయుదా వేసి ఈ నెల 25న జరుపుతున్నారని ప్రచారం. ఇలా అనుకున్న డేట్స్ కి సినిమా రాకపోవడం తో బండ్ల గణేష్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అబిమానులు.

Exit mobile version