Site icon TeluguMirchi.com

నైజాం ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్

Temper-nizamయంగ్ టైగర్ ఎన్టీఆర్ నైజాం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ‘టెంపర్’ తో ముందుకు వచ్చిన ఎన్టీఆర్ నైజాం లో భారీ కలెక్షన్స్ రాబడుతున్నాడు. టెంపర్ చిత్రం 7 రోజుల్లో 7.8 కోట్ల షేర్ చేసి రికార్డ్స్ వైపు పరుగులు తీస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టే చిత్రంగా నిలబడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో వసూళ్లపరంగా ఈ సినిమా కచ్చితంగా కొత్త రికార్డు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.

అయితే ‘టెంపర్’ మొదటి భాగం ఫై మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ సెకండ్ హాఫ్ బాగుండడం తో ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఒక్క నైజాంలోనే కాకుండా మిగతా ఆంధ్ర ప్రదేశ్, ఓవర్సేస్ లోకూడా కలెక్షన్స్ సునామి సృష్టిస్తుందని చెపుతున్నారు. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో పోసాని, జయ ప్రకాష్ రెడ్డి, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. పూరి దర్శకత్వం వహించారు.

Exit mobile version