Site icon TeluguMirchi.com

టెంపర్ కి గట్టి దెబ్బ తగిలింది..

Temper-collection-dropఏ హీరో చిత్రమయిన వీకేడ్ లో మంచి కలెక్షన్స్ రాబడతాయి అని అందరికి తెలుసు. కానీ గత శుక్ర వారం విడుదలయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రానికి మాత్రం థియేటర్స్ ఖాళీగా కనపడుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకి ఏ సినిమా అని ఆలోచిస్తున్నారా..? ఇంకా ఏ సినిమానో గుర్తుకు రాలేదా.. ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం గురించే మీము చెపుతుంది.

రెండేళ్లుగా హిట్ లేని ఎన్టీఆర్ కు టెంపర్ రూపం లో సూపర్ హిట్ వచ్చింది..మొదటి రెండు రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకపోయింది. కానీ ఆదివారం వచ్చిసరికి థియేటర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి..దీనికి కారణం ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఈరోజు జరుగుతున్నభారత్, పాకిస్తాన్ మ్యాచ్ వల్ల ఎవ్వరు కూడా థియేటర్స్ వైపు రాకుండా అందరు టీవీలాకే అతుక్కుపోయారు. సినిమా అంటే మళ్లీ ఎప్పుడయినా చూడచ్చు కానీ ఇండియా – పాక్ క్రికెట్ మళ్లీ చూడలేం కదా అని అనుకుంటున్నారు. ఈ దెబ్బ ఒక్క టెంపర్ చిత్రానికే కాదు బాలీవుడ్ , కోలీవుడ్ , ఇలా అన్ని భాషల సినిమాల ఫై ఈ ప్రభావం పడింది. దీంతో నిర్మాతలు తల పట్టుకొని కూర్చున్నారు.

Exit mobile version