తెలుగు తెర అత్తలు !

teluginti attaluఫేడౌట్ అయిన పోయిన హీరోలంతా స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.హీరోయిన్ గా స్టార్ డమ్ ను ఎంజామ్ చేసి ఫేడౌట్ అయిన హీరోయిన్స్ ప్రస్తుతం అమ్మగానో,అక్కగానో అత్తగానో రాణిస్తున్నారు. అత్త పాత్రలో హీరోయిన్స్ ఏ మాత్రం తీసిపోకుండా తమ గ్లామర్ ను మెయింటెన్ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. హీరోయిన్స్ నుంచి అత్తలుగా మారిన తెలుగింటి అత్తాలపై తెలుగు మిర్చి స్పెషల్ స్టోరీ…

హీరోయిన్ అంటేనే సినిమాకు గ్లామర్ తెచ్చే అందం.మరి ఆ అందం కాస్త ఫేడౌట్ అయితే ఏముంది… అమ్మగానో, అత్తగానో అలరిస్తుంది.అలా తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా వెలిగిన వారు ప్రస్తుతం అత్తాలుగా అలరించారు.ఇంకా అలరిస్తున్నారు. వాణిశ్రీ, లక్ష్మీ,రమ్యకృష్ణ, రోజా, నందియా వీరు ప్రస్తుతం అత్తలుగా రాణిస్తున్నారు.

vanisri

తెలుగులో మొదటి తరం గ్లామర్ హీరోయిన్ గా వాణిశ్రీ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కేవే. ఆ రోజుల్లో తన నటన గ్లామర్ తో ఆనాటి యువ ప్రేక్షకలను ఓ ఊపు ఉపారు. హీరోయిన్ గా క్రేజ్ తగ్గిన తరువాత ఆమె కూడా అత్తగా టర్న్ తీసుకున్నారు.

lakshmiఇక వాణి శ్రీ తరువాత అల్లుళ్లతో ఓ రేంజ్ లో సవాళ్లు విసిరి ధీటుగా నటించిన అత్తగా లక్ష్మీ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.సాప్ట్ కనింపించే లక్ష్మీ పొగరుగా కూడా కనింపించి ప్రేక్షకును ఆకట్టుకుంది.

nadiya 1ప్రజెంట్ గా టాలీవుడులో అత్తలు మరీ…యంగ్ గా మారిపోయారు.హీరోయిన్స్ గా సూపర్ పేమ్ అయి పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో అత్త పాత్రలను చేయడమే అందుకు కారణం.ఇందు నదియా, రమ్యకృష్ణ,రోజా ముందు వరుసలో ఉన్నారు.

తెలుగు సినీ ఫీల్డ్ కి మరింత గ్లామర్ సోగసలు అద్దిన హీరోయిన్ రమ్యకృష్ణ అని చెప్పాలి. కొంత కాలం క్రితం తెలుగులో గ్లామర్ కు కేరాఫ్ అడ్రసుగా నిలిచింది ఈ బ్యూటీ.ఇప్పుడు తెలుగు యువ హీరోల అత్తగా ప్రేక్షకులను అలరిస్తుంది.

hhతన నవ్వుతోనే కోట్లాది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ రోజా, గ్లామర్ హీరోయిన్ నటిగా మంచి పేరు తెచ్చుకుని స్టార్ గా ఎదిగిన నగ్మా ఆ తరువాతి కాలంలో అత్తపాత్రల వైపు టర్న్ తీసుకున్నారు.

ఇలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ వెలిగిన నిన్నటి తరం హీరోయిన్స్ నేడు అత్తలుగా తమ సత్తా చాటుతున్నారు. మరి వీరి బాటలో ఇంకేంత మంది అత్తలుగా రాణిస్తారో చూడాలి.