ఈ వైల్డ్‌ ఎంట్రీ కూడా కలిసిరానట్టేనా?

తెలుగు బిగ్‌బాస్‌ 3 గత సీజన్‌లతో పోల్చితే చాలా చప్పగా మారింది. మంచి ఫేం ఉన్న కంటెస్టెంట్‌లు ఉన్నా కూడా బిగ్‌బాస్‌ 3 ఆకట్టుకోలేకపోతుంది. అయితే ఆట తీరు పసిగట్టిన కంటెస్టెంట్‌లు సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారా? లేదా ఆటను రక్తి కట్టించడంలో బిగ్‌బాస్‌ విఫలం అయ్యాడా అర్థం అవడం లేదు. ఆటను కాస్త ఘాటుగా మార్చడానికి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలను కూడా ప్లాన్‌ చేశారు. తొలి వైల్డ్‌ ఎంట్రీగా ట్రాన్స్‌జెండర్‌ తమన్నా సింహాద్రి బిగ్‌బాస్‌ ఇంట్లోకి ఎంటర్‌ అయ్యింది. ఆమె తన ప్రవర్తనతో కొద్ది రోజుల్లోని బయటకు వచ్చేసింది. ఆ తర్వాత చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించినా కూడా ప్రముఖ యాంకర్‌ శిల్పా చ&క్రవర్తి బిగ్‌బాస్‌ ఇంట్లోకి రెండో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో అడుగుపెట్టింది.

శిల్ప కూడా బిగ్‌బాస్‌ ఇంట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. తను వెళ్లినప్పటి నుండి ఏ ఒక్కరితోను చనువుగా ఉండడం లేదు, అంతా ఆసక్తిగా కూడా టాస్క్‌లో పాల్గొనడం లేదు. తన ఆట తీరు నచ్చక ప్రేక్షకులు ఈమెను కూడా త్వరలోనే బయటకు పంపించాలని ప్రేక్షకులు భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్‌లో ఉన్న శిల్పకు తక్కువ ఓట్లు వచ్చినట్టు అనధికార సమాచారం. ఇదే నిజమయితే ఈ వైల్డ్‌ ఎంరట్రీతో కూడా బిగ్‌బాస్‌కు పెద్దగా ఒరిగింది ఏమి లేదు. ఆటలో కాస్త హుషారు పెంచాలని వైల్డ్‌ కార్డ్‌ ద్వారా కొత్తవారిని పంపుతున్నా కూడా బిగ్‌బాస్‌ 3కి కలిసి రావడం లేదు.