అషు రెడ్డికి ఉన్న క్రేజ్‌కు అయిదు వారాలు ఉండటమే చాలా ఎక్కువ. ఆమె ఈ వారం నామినేషన్లో ఉండటం వల్ల ఆమె ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయ్యింది. అషు కూడా తను ఇంత కాలం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నట్లుగా హ్యాపీగా బయటకు వెళ్లి పోయింది. ఎమోషనల్ ఏమీ కాలేదు. పెద్దగా బాధ పడ్డట్లుగా కూడా ఏమీ అనిపించలేదు. చాలా సేఫ్ గేమ్ ఆడియన అషు రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా చాలా సేఫ్‌గా నాగార్జున వద్ద గేమ్ ఆడింది. అందరు ఇంటి సభ్యులను ఆమె కలుపుకు పోయిన తీరు ఆశ్చర్యంగా ఉంది.