అనుకున్నట్లుగానే అషు ఔట్‌

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నుండి మరో వికెట్‌ పడిపోయింది. హేమ, జాఫర్‌, తమన్నా, రోహిణిల తర్వాత ఇప్పుడు అషు ఔట్‌ అయ్యింది. ఎలిమినేషన్స్‌కు నామినేషన్‌ జరిగిన తర్వాత రోజే మేము అషు ఈవారం ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని ఒక కథనం ప్రచురితం చేయడం జరిగింది. ఆమెకు బయట ఉన్న ఫాలోయింగ్‌ చాలా తక్కువ. ఆ కారణంగా అషు ఎలాంటి డౌట్‌ లేకుండా ఎలిమినేట్‌ అయ్యింది. అషు రెడ్డికి సోషల్‌ మీడియాలో కాస్త ఫాలోయింగ్‌ ఉన్నా కూడా ఆమెకు ఓట్ల రూపంలో అది కలిసి రాలేదు.

అషు రెడ్డికి ఉన్న క్రేజ్‌కు అయిదు వారాలు ఉండటమే చాలా ఎక్కువ. ఆమె ఈ వారం నామినేషన్‌లో ఉండటం వల్ల ఆమె ఎలిమినేషన్‌ కన్ఫర్మ్‌ అయ్యింది. అషు కూడా తను ఇంత కాలం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నట్లుగా హ్యాపీగా బయటకు వెళ్లి పోయింది. ఎమోషనల్‌ ఏమీ కాలేదు. పెద్దగా బాధ పడ్డట్లుగా కూడా ఏమీ అనిపించలేదు. చాలా సేఫ్‌ గేమ్‌ ఆడియన అషు రెడ్డి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా చాలా సేఫ్‌గా నాగార్జున వద్ద గేమ్‌ ఆడింది. అందరు ఇంటి సభ్యులను ఆమె కలుపుకు పోయిన తీరు ఆశ్చర్యంగా ఉంది.