బిగ్‌బాస్ 3వ సీజన్ రెండవ వారం ప్రారంభం అయ్యింది. రెండవ వారం ప్రారంభం రోజే ఎలిమినేషన్ నామినేషన్స్ జరిగాయి. కన్ఫెషన్ రూంకు వచ్చి ఎవరికి వారు అన్నట్లుగా ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. నామినేషన్ పక్రియలో భాగంగా బాబా భాస్కర్ తాను ఎవరిని నామినేట్ చేయాలని భావించడం లేదు అన్నాడు. దాంతో కాస్త సీన్ సీరియస్ అయ్యింది. మీరు నామినేట్ చేయకుంటే మొత్తం అందరు నామినేట్ అవుతారు అంటూ చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కూడా నామినేషన్లో పాల్గొన్నాడు.
ఇక నామినేషన్స్ సందర్బంగా ఎక్కువ శాతం మంది హిమజ మరియు శ్రీముఖికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఆ తర్వాత జాఫర్, వరుణ్ సందేశ్, వితిక, మహేష్, రాహుల్‌లకు కూడా అధికంగా ఓట్లు పడ్డాయి. అత్యంత నాటకీయ పరిణామాల మద్య బిగ్‌బాస్ ఈ వారం ఏకంగా 8 మందిని నామినేషన్లో ఉంచాడు. ఈ ఎనిమిది మంది ఎవరు అంటే… శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వరుణ్ సందేశ్, వితిక షేరు, పునర్నవి, రాహుల్ రవీంద్రన్. ఈ ఎనిమిది మందిలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు అనేది చూడాలి. ఇక నిన్ననే ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రీకి ఎలిమినేషన్ నుండి సేఫ్ లభించింది.