తమిళ సినిమా ఇండస్ట్రీలో ’96’ ఒక క్లాసిక్ చిత్రంగా నిలిచి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆన్లైన్లో, టీవీలో వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి ఈ చిత్రాన్ని చూశారు అంటూ అది ఎంతటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ సేతుపతి మరియు త్రిష జంటగా తెరకెక్కిన ఆ చిత్రంను తెలుగులో శర్వానంద్ మరియు సమంత జంటగా చేస్తున్న విషయం తెల్సిందే. దిల్‌రాజు ఈ చిత్రంను చాలా ఇష్టపడి నిర్మిస్తున్నాడు. కమర్షియల్‌గా హిట్ ఫట్ అనే విషయాన్ని పక్కన పెట్టి ఈ చిత్రంను ఆయన చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.
గత కొన్ని రోజులుగా ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్లో సినిమాను విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ డిసెంబర్ మిస్ అయితే సమ్మర్ వరకు అంటే ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకే షూటింగ్ కాస్త స్పీడప్ చేసి డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా కాని, లేదంటే అంతకు ముందే సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరగడం లేదు. త్వరలోనే శర్వా మరియు సమంతలతో పాటు కీలక నటీనటులతో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. అక్టోబర్‌లో సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట.