Site icon TeluguMirchi.com

బాలయ్య కూతురు నిర్మాణంలోకి..!

నందమూరి బాలకృష్ణకు ముగ్గురు పిల్లలు. ఒక బాబు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరమ్మాయిల పెళ్లిలు ఇప్పటికే అయ్యింది. ఇలాంటి సమయంలో చిన్నమ్మాయి తేజస్వి సినిమా రంగ ప్రవేశం గురించి ఆమె భర్త ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలకృష్ణగారి ఇద్దరు కూతుర్లు కూడా అందంగా ఉంటారు. మరి ఎందుకు హీరోయిన్స్‌గా పరిచయం చేయలేదో నాకు తెలియదు అన్నాడు. తన భార్య తేజస్వికి నటన మరియు డాన్స్‌ అంటే చాలా ఆసక్తి ఉందని, కాని ఆమెను ఆదిశగా ఎవరు తీసుకు వెళ్లలేదని అన్నాడు.

నేను ఆమెకు పూర్తి స్వేచ్చ ఇస్తాను. ఆమె ఇష్టానుసారంగా సినిమాల్లోకి వెళ్లేందుకు నేను ఎప్పుడు అడ్డు పడును. కాని ప్రస్తుతం తేజస్వికి సినిమాల గురించి ఆలోచన లేదు. భవిష్యత్తులో సినిమాలను నిర్మించే అవకాశం మాత్రం ఉందని అన్నాడు. తేజస్వి నిర్మాణంలో బాలకృష్ణ గారి సినిమాలు కూడా ఉండే అవకాశం ఉందని భరత్‌ అన్నాడు. ఇక భరత్‌ గ్రీన్‌ సిగ్నల్‌తో తేజస్వి త్వరలోనే నిర్మాణంలో అడుగు పెట్టేనో చూడాలి. మరో వైపు బాలయ్య పెద్దమ్మాయి బ్రహ్మణి బిజినెస్‌ వ్యవహారాలతో చాలా బిజీగా ఉంటుంది. ఆమెకు ఇలాంటి వాటిపై ఆసక్తి లేదని భరత్‌ అన్నాడు.

Exit mobile version