చిత్రసీమలో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ కి రంగం సిద్ధం అవుతోంది. కమల్ హాసన్ – తేజల కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇప్పటికే దర్శకుడు తేజ కమల్ కి కథ చెప్పాడట. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకాస్త సమయం పట్టొచ్చని తెలుస్తోంది. కమల్ ఇప్పటికే విశ్వరూపం 2, ఉత్తమ విలన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇవి రెండూ కాకుండా కొన్ని ప్రాజెక్టులపై ఇది వరకే సంతకాలు చేశాడు. ముందు ఒప్పుకొన్న సినిమాల తరవాతే… తేజతో సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తేజ కూడా ధృవీకరించారు. ”కమల్ని కలుసుకొని సినిమా గురించి చర్చించిన మాట వాస్తవమే. అయితే ఈ సినిమాకి ఇంకాస్త సమయం పడుతుంది..” అంటున్నారు.