తానా స్టార్స్ వీరే..

అమెరికాలో ప్రతి ఏటా తానా సభలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయనే సంగతి తెలిసిందే. ఈ సభలకు టాలీవుడ్ నుండి చాలామంది స్టార్సే హాజరై..సభలకు మరింత అందాన్ని తీసుకొస్తారు. ఇక ఈఏడాది కూడా తానా సభలకు ముస్తాబు అయ్యాయి.

ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరవుతుండడం విశేషం. ఈయన తో పాటు అల్లరి నరేష్, నారారోహిత్, సునీల్ , కమిలినీ ముఖర్జీ మొదలగు స్టార్స్ హాజరవుతున్నారు. వీరితో పాటు అలాగే గాయని సునీత, యాంకర్ సుమ జాబితాలో వున్నారు. అలాగే పలువురు రాజకీయ నేతలు సైతం హాజరవుతున్నారు.

అలాగే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ను సైతం సభలకు రప్పించాలని గట్టిగానే ట్రై చేసారు కానీ.. తనకు వ్యక్తిగత, ఫ్యామిలీ పనులు వున్నాయని, రాలేనని చెప్పినట్లు తెలుస్తోంది.