విజ‌య్‌కి మ‌ళ్లీ చుక్కెదురు

Tamil-star-hero-in-deep-proసూర్య‌, కార్తి, విక్రమ్, విశాల్ ఈ త‌మిళ హీరోలంద‌రికీ తెలుగులో గుర్తింపు ఉంది. మార్కెట్ కూడా ఉంది. లేనిద‌ల్లా విజ‌య్‌ కి మాత్రమే. విజ‌య్ సినిమాలు చాలా రీమేకులుగా వ‌చ్చి తెలుగు నాట విజ‌యం సాధించాయి. డ‌బ్బింగ్ బొమ్మల‌కు మాత్రం అంత సీన్ లేక‌పోయింది. తుపాకీ సినిమా త‌మిళంలో బాగా ఆడింది. తెలుగులో మాత్రం అంతంత మాత్రమే. ఈసారి ఎలాగైనా తెలుగులో మార్కెట్ సంపాదించాలి అనుకొన్నాడు విజ‌య్‌. అందుకే త‌న త‌లైవాని అన్నగా తీసుకొచ్చాడు. అయితే విజ‌య్‌ కి మ‌ళ్లీ తెలుగులో చుక్కెదురు అయ్యింది. ఈ డ‌బ్బింగ్ సినిమాని ప‌ట్టించుకొనే నాధుడే లేక‌పోయాడు. వ‌సూళ్లు కూడా అంతంత మాత్రమే. మ‌రోవైపు ఈ సినిమా త‌మిళంలో అస్సలు విడుద‌ల కాలేదు. శాంతిభ‌ద్రత‌ల‌కు విఘాతం క‌లిగించే స‌న్నివేశాలు ఉన్నందున‌.. ఈ సినిమా విడుద‌ల కాలేదు. త‌మిళ‌నాడు, పాండిచ్చేరి మిన‌హా ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేశారు. కానీ ఏం లాభం..? సినిమాకి నెగిటీవ్ టాక్ వ‌చ్చింది. ఇక విజ‌య్ సినిమా కోలుకోవ‌డం క‌ల్లే.