తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా కొలవెరిడీ అంటూ ఆకట్టుకున్న తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి తమిళ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పుకారు షికారు చేస్తూనే ఉంటుంది. కెరీర్ ఆరంభంలో ఈ యువ సంగీత దర్శకుడు హాట్ హీరోయిన్ ఆండ్రియాతో ప్రేమాయణ సాగించాడు. ఆమెతో చాలా అడ్వాన్స్ అయ్యాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెల్సిందే. ఆ తర్వాత పలువురు సింగర్స్‌తో మనోడు శృంగారంలో తేలి పోయాడు అనే టాక్ వచ్చింది. ఇప్పుడు తాజాగా అనిరుధ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ తమిళ మీడియాలో వార్తలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.
తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ బంగారం షాపు యజమాని కూతురుతో అనిరుధ్ పెళ్లి జరుగబోతుంది అంటూ గత రెండూ మూడు రోజులుగా సోషల్ మీడియా మరియు వెబ్ మీడియాలో వార్తలు ఓ రేంజ్లో వస్తున్నాయి. అయితే అవన్ని ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. అనిరుధ్ సన్నిహితులు ఆ వార్తలను కొట్టి పారేశారు. మీడియాలో ప్రచారం జరుగుతున్న ఆ బంగారం షాపు యజమానికి కూతురే లేదట. అనిరుధ్‌కు ఉన్న క్రేజ్‌ను కొందరు క్యాష్ చేసుకునేందుకు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని అనిరుధ్ సన్నిహితులు అంటున్నారు.