తమిళ బిగ్‌బాస్ లో ఇటీవల ఓ ఇంటి సభ్యురాలికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తనే అందంతో, ఆటతో ఇటీవల చాలా పాపులర్ అవుతూ వస్తున్న లోస్లియా. ఈ అమ్మడు బిగ్‌బాస్ ఇంట్లో తోటి కంటెస్టెంట్ కెవిన్‌తో కాస్త చనువుగా ఉంది. దాంతో ఈ ఇద్దరి మద్య క్లోజ్‌నెస్ బాగా పెరిగిపోయింది. బిగ్‌బాస్ ఇంట్లోకి తనకోసం వచ్చిన తండ్రిని చూడగానే లోస్లియా చాలా ఎమోషనల్ అయ్యింది. కానీ తన తండ్రి మాత్రం విచిత్రంగా ప్రవర్తించి ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు కూడా షాకిచ్చారు. వస్తూ వస్తూనే కూతురు లోస్లియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్ను ఇలాగేనా పెంచింది, కెవిన్‌తో నీ ప్రేమాయణం ఏంటి అంటూ ఎడాపెడా తిట్ల దండకం మొదలెట్టాడు. దాంతో లోస్లియా గుక్కపెట్టి ఏడ్చేసింది. కన్నీటిభరితమైన ఈ అమ్మడిని చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా ఈమె తండ్రిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రేమ అంత పెద్ద నేరం కాదు అంటూ యువత లోస్లియాకు మద్దతుగా నిలిచారు.