తెలుగులో సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని ఇప్పటికే హిందీలో రీమేక్ చేసి సంచలన విజయాన్ని దక్కించుకున్న విషయం తెల్సిందే. హిందీలో ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి 2019 ఏడాది టాప్ చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు బాలీవుడ్లో ఈ ఏడాది అత్యధికంగా వసూళ్లు చేసింది కబీర్ సింగ్. అంతటి ఘన విజయం సాధించిన నేపథ్యంలో అర్జున్ రెడ్డికి తమిళ రీమేక్ అయిన ‘ఆధిత్య వర్మ’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ అయిన ఆధిత్య వర్మ చిత్రంలో విక్రమ్ తనయుడు దృవ హీరోగా నటించిన కారణంగా మరింత ఆసక్తి ఉంది. ఆయన గతంలో చేసిన వర్మ సినిమాను మొత్తం మార్చేసి ఆధిత్య వర్మ అంటూ కొత్తగా తీసిన విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆధిత్య వర్మ ఇప్పుడు విడుదల కోసం వెయిట్ చేస్తుంది. సినిమాను సరైన సమయంలో విడుదల చేసి క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో యూనిట్ సభ్యులు ఉన్నారు. అందుకే ఈ చిత్రంకు సేఫ్ జోన్ అని సెప్టెంబర్ 27న విడుదల చేయబోతున్నారు. ఆ రోజున ఎలాంటి సినిమాలు పెద్దగా విడుదలకు లేవు. అందుకే సినిమా ఖచ్చితంగా పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంటే భారీ వసూళ్లు ఖాయం అంటున్నారు.