Odela 2 : తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న మల్టీ లింగ్వల్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల 2’ ట్రైలర్‌ను ఏప్రిల్ 8న ముంబైలోని ఐకానిక్ గెలాక్సీ థియేటర్, బాంద్రా వెస్ట్‌లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా, మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్‌వర్క్స్ పతాకాలపై డి మధు నిర్మిస్తున్నారు.
Also Read : అశ్విన్ బాబు హీరోగా ‘వచ్చినవాడు గౌతమ్’ ఫస్ట్ లుక్ విడుదల !
తమన్నా భాటియా ఈ సినిమాలో తన కెరీర్‌లో ఎన్నడూ చేయని విధంగా ఓ భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో, సినిమా పై అంచనాలు గణనీయంగా పెరిగాయి. ప్రతి అప్‌డేట్‌తో సినిమాపై బజ్ పెరుగుతుండగా, ఈ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈ బజ్‌ను మరింత పెంచనుంది. ఏప్రిల్ 17న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలకి సిద్దంగా ఉంది.