Site icon TeluguMirchi.com

తమన్నా స్వీట్స్.. భలే టేస్ట్!!

thamanna

మిల్కీబ్యూటీ తమన్న దగ్గర బోలేడు రకాల మిఠాయిలు వున్నాయట. ఎవరైనా లొట్టలోసుకొని తినాల్సిందే. ఇంతకీ తమన్నా స్వీట్స్ దుకాణం ఎప్పుడు పెట్టింది అంటారా..?? ఇటీవలే, కానీ నిజజీవితంలో కాదులేండీ. మహేష్ ’ఆగడు’ సినిమాలో తమన్నా మిఠాయి దుకాణం నడిపే అమ్మాయిగా కనిపిస్తుందట. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఈ బ్యూటీ.. స్వీట్స్ టేస్ట్ తెలియాలంటే.. ’ఆగడు’ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రానికి దర్శకత్వం శ్రీను వైట్ల, సంగీతం ఎస్.ఎస్. థమన్.

Exit mobile version