బాలీవుడ్‌లో ‘క్వీన్’ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ఈ చిత్రాన్ని దక్షిణాది భాషలలో కూడా రీమేక్ చేయాలని నిర్మాత త్యాగరాజన్ సన్నాహాలు చేస్తున్నాడు. అందుకోసం ఒక్కో భాష నుండి ఒక్కో హీరోయిన్‌ను ఎంపిక చేస్తున్నారు. మిల్కీ బ్యూటి తమన్నాను కూడా ‘క్వీన్’ కోసం సంప్రదించారట. కాగా తమన్నా భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేయడంతో దాదాపు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. గత రెండు మూడు రోజుల నుండి ‘క్వీన్’ ప్రాజెక్ట్ అటకెక్కింది అనే వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. దాంతో ఈ వార్తపై నిర్మాత త్యాగరాజన్ స్పందించాడు.
‘క్వీన్’ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదు, కచ్చితంగా ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. కాకపోతే తమన్నాను ఈ చిత్రం కోసం తీసుకున్నాం కానీ ఆమె భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేస్తోంది, అంత మొత్తాన్ని మేము ఇచ్చుకోలేం తమన్నా తగ్గకపోతే ఈ ప్రాజెక్ట్ నుండి ఆమెను తప్పించి వేరే వారిని ఎంపిక చేస్తాం కానీ ప్రాజెక్ట్‌ను వదిలేసేది లేదు, ఈ విషయంలో ఏం సందేహం లేదు అంటూ నిర్మాత త్యాగరాజన్ క్లారిటీ ఇచ్చాడు. తమన్నా సమస్యగా మారింది తను ఒప్పుకోకపోతే వెంటనే వేరే వారిని తీసుకుంటాం అంటూ చెప్పుకొచ్చాడు.