గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆడవారిని వస్తువులుగా చూసేవారని, ఆడవారిని అణగదొక్కడానికే ప్రయత్నించే వారని అభిప్రాయాలు వ్యక్తం చేసిన తమన్నా కాని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, తమకు కావాల్సిన పాత్రలను ఆడవారిని గౌరవిస్తూ పని చేయించుకుంటున్నారని తమన్నా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అప్పటిలాగా కురచ దుస్తులనే ధరించాలి, ఇలాగే కనబడాలి అనే ఆంక్షలు ఏవీ లేవని, మెప్పించే విధంగా నటించడం మాత్రమే చూస్తున్నారని, హీరోయిన్లపై లైంగిక వేధింపులు అవాస్తవం అని తమన్నా కొట్టిపారేసింది. అంతేకాకుండా మహిళలకు సమాన అవకాశాలను అడుక్కోవద్దు అని, డిమాండ్ చేసి లాక్కోవాలని మహిళలను హెచ్చరించింది.