టాలీవుడ్‌లో అగ్రకథానాయికగా వెలుగొందుతున్న మిల్కీబ్యూటి తమన్నా తాజాగా లైంగిక వేధింపుల గురించి స్పందించింది. ఇటీవల పలువురు హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లపై జరుగుతున్న వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మీడియా వారు లైంగిక వేధింపుల గురించి మీ మాటల్లో అని అడగగా మిల్కీబ్యూటి తనదైన రీతిలో స్పందించింది. తన కెరియర్‌లో ఇంతవరకు లైంగిక వేధింపులకు ఎవరు పాల్పడలేదని, అలాంటి సందర్భాలు తనకు రాలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా చిత్ర పరిశ్రమలో కూడా ఇప్పుడు ఆడవారికి చాలా గౌరవం పెరిగింది అపి తమన్నా క్లారిటీ ఇచ్చింది.
గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆడవారిని వస్తువులుగా చూసేవారని, ఆడవారిని అణగదొక్కడానికే ప్రయత్నించే వారని అభిప్రాయాలు వ్యక్తం చేసిన తమన్నా కాని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, తమకు కావాల్సిన పాత్రలను ఆడవారిని గౌరవిస్తూ పని చేయించుకుంటున్నారని తమన్నా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అప్పటిలాగా కురచ దుస్తులనే ధరించాలి, ఇలాగే కనబడాలి అనే ఆంక్షలు ఏవీ లేవని, మెప్పించే విధంగా నటించడం మాత్రమే చూస్తున్నారని, హీరోయిన్లపై లైంగిక వేధింపులు అవాస్తవం అని తమన్నా కొట్టిపారేసింది. అంతేకాకుండా మహిళలకు సమాన అవకాశాలను అడుక్కోవద్దు అని, డిమాండ్ చేసి లాక్కోవాలని మహిళలను హెచ్చరించింది.