Site icon TeluguMirchi.com

తాప్సి కూడా సర్దేసింది

taapseeమొన్న తమన్నా-ఈరోజు తాప్సి! బోలెడు ఆశలతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కథానాయికలు. ‘హిమ్మత్ వాలా’తో తమన్నాకు చేదు అనుభవం ఎదురైంది. మరో శ్రీదేవి అని పొగిడిన నోళ్లే ‘తమన్నాకు అంత లేదు’ అని తీర్మాణించేశారు. ఇప్పుడు తాప్సి పరిస్థితీ అంతే. ‘షష్మీబద్దూర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇంచ్చిందీ పంజాబీ పడుచు. ఈ సినిమా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. దాంతో.. తాప్సి ఆశలు కూడా ఆడియాశలు అయిపోయాయి. ఇక అక్కడి నుంచి తాప్సికి మరో పిలుపు వస్తుందనుకోవడం అత్యాసే అవుతుంది. అయితే తాప్సి మాత్రం ఇంకా
నమ్మాకాలు పెంచుకొంటోంది. “జయపజయాలతో ప్రతిభను బేరీజు వేయలేం. నాపనితనం బాలీవుడ్ కి నచ్చింది. అక్కడ మరో సినిమా చేస్తా..” అని చెబుతోంది. చింత చచ్చినా పులుపు చావలేదు అంటే ఇదే!

Exit mobile version