తాప్సి డబ్బులూ పోయాయి..

taapsi‘గుండెల్లో గోదారి’ సినిమా నటిగా తాప్సికి ఎంత పేరు తీసుకొచ్చిందో తెలీదు గానీ, ఆర్ధికంగా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆ సినిమా కి నిర్మాత మంచు లక్ష్మి కదా? అంటారా? అక్కడికే వస్తున్నాం. ఈ సినిమాకి నిర్మాత లక్ష్మి ప్రసన్నే. కానీ తాప్సి కూడా కొన్ని డబ్బులు సర్దుబాటు చేసిందట. ‘గుండెల్లో గోదారి’ ఆర్ధిక ఇబ్బందులలో వున్నప్పుడు తాప్సి పెట్టుబడి పెట్టిందట. పారితోషికం కూడా తిరిగి ఇచ్చిందట. “లాభాలోస్తే అప్పుడు తీసుకుందాం” అని చెప్పిందట. అయితే…. ఈ సినిమా ఆర్ధికంగా నిలదొక్కుకోలేక పోయింది. దాంతో తాప్సి డబులు కూడా గోదాట్లో పోసినట్టయ్యింది. ఇదీ ఓ అనుభవమే. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చేయదు.