బిగ్ బాస్ హౌస్ లో సైరా సందడి..

బిగ్ బాస్ హౌస్ లో సైరా టీం సందడి చేయబోతుంది..కాకపోతే ఈ సందడి తెలుగు బిగ్ బాస్ హౌస్ లో కాదు..సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ షో లో..గత కొంతకాలంగా హిందీ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న బిగ్ బాస్ షో..ఇటీవల సీజన్ 13 ఘనంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో షోకి బాలీవుడ్ నటి హీనా ఖాన్ స్పెషల్ గెస్ట్‌గా రాబోతున్నారు.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే ఇదే షో లో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా యూనిట్ పాల్గొనబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణ్, తమన్నా తదితరులు షోకు గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది.