Site icon TeluguMirchi.com

దారుణం : ఆన్లైన్ లో సైరా ఫుల్ మూవీ…

భారీ అంచనాల మధ్య ఈరోజు వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా మూవీ గా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న చిత్రం సైరా నరసింహ రెడ్డి. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీ ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. కొణెదల ప్రొడక్షన్ బ్యానర్ ఫై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమాకు అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ రావడం తో చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఆ సంబరాలను ఎంతో సేపు ఉండకుండా చేసింది తమిళ్ రాకర్స్.

మాట్నీ షో కంటే ముందే ఆన్లైన్ లో పైరసీ ప్రింట్ ను వదిలింది తమిళ్ రాకర్స్. ఈ లింక్ చూసి చాలామంది షాక్ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకునం చిత్ర యూనిట్ పైరసీ ని ఎంకరేజ్ చేయద్దని..సినిమాను థియేటర్స్ లలో చూడాలని..ఎక్కడైనా పైరసీ లింక్ కనిపిస్తూ వెంటనే పోలీసులకు తెలుపాలని అభిమానులకు సూచించారు. ఇప్పటికే చక్కర్లు కొడుతున్న పైరసీ లింకులతో మెగా అభిమానులు ఆయా ప్రాంతాల్లోని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

థియేటర్లలో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయకూడని కోరింది. ఇక పైరసీ లింకులు కనిపిస్తే syeraaantipiracy@gmail.comకి పంపించాలని సూచించింది. ఇక ఇప్పటికే సైరా చిత్రం పైరసీకి గురికావడంతో అభిమానుల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందుతాయి. చిత్ర యూనిట్‌కు పైరసీ లింకులను షేర్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. మీకు కూడా ఎక్కడైనా పైరసీ లింకులు కనిపిస్తే పైన పేర్కొన్న మెయిల్ ఐడీకి పంపించండి.

Exit mobile version