రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం టీజర్ కోసం దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్మాత రామ్ చరణ్‌తో ఏకంగా 150 కోట్లకు పైగా ఖర్చు చేయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ భారీ తనంతో పాటు సినిమా స్థాయి పెంచేలా టీజర్ ఉండాలనే ఉద్దేశ్యంతో దాదాపుగా రెండు వారాల పాటు కష్టపడి టీజర్‌ను కట్ చేయించినట్లుగా తెలుస్తోంది. మూడు నాలుగు వర్షన్లు కట్ చేయించి ఫైనల్‌గా చిరంజీవి మరియు పవన్‌ల సలహా మేరకు ఒకటి ఉంచారు.
ఆ టీజర్‌కు పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణ కాబోతుంది. కేవలం టీజర్‌కే వాయిస్ ఓవర్ చెప్పడం సైరా సినిమాకే జరిగిందనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ చాలా పవర్ ఫుల్ వాయిస్‌తో సైరా అంటూ నినదించడం టీజర్‌కే హైలైట్ అవుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. అద్బుతమైన స్క్రీన్‌ప్లేతో పాటు, కథనంలోని ట్విస్ట్‌లను రివీల్ చేయకుండా టీజర్‌ను కట్ చేశారట. టీజర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక అద్బుతంగా ఉంటుందని టాక్ వినిపస్తుంది. మొత్తానికి రికార్డు స్థాయిలో వ్యూస్‌ను దక్కించుకునేందుకు సైరా సిద్దం అయ్యాడు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడం, మలయాళంలో కూడా టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.