తెలుగు రాష్ట్రాల్లో ‘సైరా’ టార్గెట్‌ ఎంతో తెలుసా?

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. గత రెండు సంవత్సరాలుగా ఈచిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాతలు కొనుగోలు చేయడం జరిగింది. సైరా చిత్రం నైజాం రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు దక్కించుకున్నాడు. దాదాపుగా 30 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇక సీడెడ్‌లో ఎన్వీప్రసాద్‌ 22 కోట్లకు కొనుగోలు చేశాడని సమాచారం అందుతోంది. దాంతో పాటు ఇతర ఏరియాల్లో కలిపి మొత్తంగా 112.35 కోట్ల వరకు బిజినెస్‌ చేసిందని సమాచారం.

చిరంజీవి కనుక తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్‌ ఉండటం కన్ఫర్మ్‌. సినిమా హిట్‌ అయితే బ్రేక్‌ ఈవెన్‌ సాధించడం పెద్ద కష్టం ఏమీ కాదు. కాని సినిమా ఫలితం తేడా కొడితే మాత్రం నిర్మాత మరియు బయ్యర్లకు భారీ నష్టాలు తప్పవంటున్నారు. చిరంజీవి 150 చిత్రం ఖైదీ నెం.150 మంచి విజయాన్ని సాధించినా కూడా ఈస్థాయిలో వసూళ్లను మాత్రం దక్కించుకోలేదు. కాని ఇప్పుడు సైరా చిత్రంకు మరీ ఎక్కువ హోప్ట్‌ పెట్టుకుని బయ్యర్లు కొనుగోలు చేశారా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. బయ్యర్లు అంతా సేఫ్‌ అవ్వాలి అంటే ఈ చిత్రం 120 కోట్ల షేర్‌ను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకోవాల్సి ఉంది. మరి అంత సైరాకు సాధ్యమా చూడాలి.