అన్ని భాషల డిజిటల్ రైట్స్‌తో పాటు సినిమాను నెల లోపే విడుదల చేసుకునేలా ఒప్పందం చేసుకోవడం వల్ల ఇంత భారీ మొత్తంను చెల్లించినట్లుగా సమాచారం అందుతోంది. సైరా చిత్రం కోసం అమెజాన్ ఇంత వెచ్చించడంపై సినీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. తెలుగు సినిమాలకు డిజిటల్ రూపంలో పెద్దగా ఆదరణ లేదు. ఇలాంటి సమయంలో ఏకంగా 40 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాల డిజిటల్ వ్యూవర్స్ తక్కువ ఉన్నా భవిష్యత్తులో ఖచ్చితంగా భారీగా పెరుగుతారనే నమ్మకంతో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది.