మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2 లేదా ఆ తర్వాత వారంలో విడుదల కాబోతుంది. దసరా సందర్బంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం ఇంకా హిందీ భాషల ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతుంది. అన్ని భాషల్లో కూడా ఈ చిత్రంకు మంచి క్రేజ్ ఉంది. దాంతో ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ధరను అమెజాన్ భారీ మొత్తంకు దక్కించుకుంది. నెట్‌ప్లిక్స్ ఈ చిత్రంను 30 కోట్ల వరకు కొనుగోలు చేయాలని భావించింది. కాని అమెజాన్ ఏకంగా 42.5 కోట్ల వరకు పెట్టడం జరిగింది.
అన్ని భాషల డిజిటల్ రైట్స్‌తో పాటు సినిమాను నెల లోపే విడుదల చేసుకునేలా ఒప్పందం చేసుకోవడం వల్ల ఇంత భారీ మొత్తంను చెల్లించినట్లుగా సమాచారం అందుతోంది. సైరా చిత్రం కోసం అమెజాన్ ఇంత వెచ్చించడంపై సినీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. తెలుగు సినిమాలకు డిజిటల్ రూపంలో పెద్దగా ఆదరణ లేదు. ఇలాంటి సమయంలో ఏకంగా 40 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాల డిజిటల్ వ్యూవర్స్ తక్కువ ఉన్నా భవిష్యత్తులో ఖచ్చితంగా భారీగా పెరుగుతారనే నమ్మకంతో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది.