Site icon TeluguMirchi.com

షాక్ : చిరంజీవి దిష్టిబొమ్మ, పోస్టర్లు దహనం..

ఓ పెద్ద సినిమా వస్తుందంటే ఆ సినిమా ఫై ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో..అదే రేంజ్ లో వివాదాలు ఉంటాయి. ఇప్పటికే పలు సినిమాల పట్ల వివాదాలు చోటు చేసుకోగా..తాజాగా మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్ర విషయంలోనే అదే జరిగింది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. దానికి తగ్గట్లే సినిమాను పాన్ ఇండియా గా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పట్ల కళింగసేన పార్టీ నేతలు వ్యతిరేకిస్తూ సైరా పోస్టర్ లను , చిరంజీవి దిష్టి బొమ్మలను తగలబెట్టారు. భువనేశ్వర్‌లో ‘సైరా’ సినిమాను ప్రదర్శించనున్న శ్రీయ థియేటర్‌ వద్ద కళింగసేన పార్టీ సోమవారం నిరసన తెలిపింది. ఆందోళనకారులు అమితాబ్‌బచ్చన్‌, చిరంజీవి దిష్టిబొమ్మలు దహనం చేసి, పోస్టర్లకు నిప్పంటించారు.

కళింగసేన కార్యదర్శి బిజయ్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఖుర్దా ప్రాంతం ప్రజలు పయికొ విప్లవం పేరిట తొలి పోరాటం చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా పయికొ విప్లవం తొలిదిగా ప్రకటించారు. ‘సైరా’ దర్శకుడు తప్పుగా చిత్రీకరించి ఒడిశా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. రాష్ట్రంలో ఈ సినిమాను ప్రదర్శించనీయం’’ అని హెచ్చరించారు.

Exit mobile version