Site icon TeluguMirchi.com

సైరా సెకండ్ డే కలెక్షన్స్..

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి జీవిత కథగా తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియన్ మూవీ గా అక్టోబర్ 02 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తో , సినీ ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు.

బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 85కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిన సైరా.. రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను కొనసాగించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 60కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన సైరా.. రెండో రోజు రూ.45కోట్లు సాధించాడన్నది ట్రేడ్ వర్గాల సమాచారం. దీంతో కేవలం రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.100కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.

ఇక కర్ణాటకలోలో సైరా కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. మొదటి రోజు రూ.8కోట్ల వరకు రాబట్టిన సైరా.. రెండో రోజు కూడా రూ.5కోట్లు వరకు కొల్లగొట్టిందనేది సమాచారం. అటూ ఓవర్సీస్‌లోనూ సైరా కలెక్షన్లు దుమ్ము రేపుతున్నాయి. అయితే హిందీలో మాత్రం సైరాకు కలెక్షన్లు అనుకున్నంత రేంజ్‌లో రావడం లేదనేది ట్రేడ్ వర్గాల సమాచారం.

Exit mobile version