Site icon TeluguMirchi.com

టీజర్ టాక్ : సైరా – రికార్డులు బద్దలే

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ . సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా నిర్మించబడుతోంది. రాంచరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా , బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేదీ సంగీతం అందిస్తున్నారు. గత ఏడాది మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమాలో ప‌లు కీల‌క‌పాత్ర‌ల్లో వివిధ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప్రముఖ న‌టులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేస‌విలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యం లో రేపు (ఆగస్టు 22) మెగాస్టార్ చిరంజీవి జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా ఓ రోజు ముందుగానే మెగా అభిమానులకు మెగా గిఫ్ట్ ఇచ్చారు సైరా యూనిట్. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. టీజర్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు..ఈ ఒక్క టీజర్ చాలు ఇండస్ట్రీ రికార్డు బద్దలు కావడానికి..మెగా స్టార్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడబోతాడని చెప్పవచ్చు. అంతేకాదు టీజర్ లో ఈ యుద్ధం ఎవరిది అంటూ చిరు చెప్పిన డైలాగ్‌ సినిమా ఫై మరింత ఆసక్తి పెంచేలా ఉంది.

అమిత్‌ త్రివేదీ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ఈ సినిమాను ఓ స్థాయి కి తీసుకెళ్లబోతుందని అర్ధం అవుతుంది. విజువల్ పరంగా కూడా సినిమా అద్భుతంగా ఉండనుందని కనిపిస్తోంది. అలాగే ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రాణం పోస్తుందని టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ఓ కోట ఫై నిలబడిన చిరంజీవి నరసింహ రెడ్డి గా చాలా గంభీరంగా కనిపిస్తూ , అద్భుతమైన పోరాటపటిమతో కనిపించారు. గుర్రం ఫై యుద్ధం చేస్తూ మరోసారి కొదమసింహం సినిమాను గుర్తు చేసారు. ఓవరాల్ గా సైరా చిత్రం తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పే చిత్రం అవుతుందని తెలుస్తుంది.

మీరు కూడా ఈ టీజర్ ఫై లుక్ వేసి ఎంజాయ్ చెయ్యండి.

Exit mobile version