“సీతమ్మ…” ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ వేడుకలు

SVSC Platinum Disc 6దాదాపుగా రెండు దశాబ్ధాల తర్వాత తెలుగులో వచ్చిన మల్టీస్టారర్‌ చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”. విక్టరీ వెంకటేశ్‌, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు అన్నదమ్ములుగా నట విశ్వరూపం చూపించిన చిత్రం రిలీజ్‌ కు ముందునుండే భారీ అంచనాలను మూటగట్టుకున్న విషయం తెలిసిందే! ఆ అంచనాలను తలదన్నేలాంటి విజయాన్ని మూట గట్టుకుంది “సీతమ్మ…”.

SVSC Platinum Disc 4చేసింది రెండో చిత్రమే అయినా సినిమా మేకింగ్‌ పై తన ప్యాషన్‌, పట్టు ఏమిటో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల నిరూపించాడు. 139నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో ఏ ఒక్క ఫ్రేం లోనూ వెంకీగానీ, మహేశ్‌ గానీ కనిపించకుండా కేవలం చిన్నోడు, పెద్దోడు పాత్రలు మాత్రమే కనిపించేలా చేయగలిగాడు శ్రీకాంత్‌.

SVSC Platinum Disc 7ఇక ఈ చిత్ర విజయంలో మరో ప్రధానపాత్ర చిత్రంలోని పాటలది. సంగీత దర్శకుడు మిక్కీ కి ఇదే తొలి భారీ చిత్రం. పెద్ద హీరోల చిత్రాలకు మొదటి సారిగా సంగీతం అందించినప్పటికీ ఎక్కడా తన స్టైల్‌ మిస్‌ కాకుండా అద్భుతమైన మాధుర్యప్రధానమైన పాటలనందించాడు. ఈ చిత్రం ఆడియో సూపర్‌ డూపర్‌ హిట్‌ గా నిలిచి ఈ రోజు ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ జరుపుకుంది.

SVSC Platinum Disc 5చిత్ర నిర్మాత దిల్‌ రాజు తనదైన బాణీలో ఓ సంప్రదాయబద్ధమైన పెళ్ళివేడుకలా ఈ ఫంక్షన్‌ జరిపాడు. స్టేజ్‌ పై మిక్కీ బృందం నిర్వహించిన చిత్రంలోని పాటల విభావరి ఆహుతులను అలరించింది.

SVSC Platinum Disc 2ఈ వేడుకలో మూవీ మొఘల్‌ డా.డి.రామానాయుడు, సూపర్‌ స్టార్‌ కృష్ణ, విజయనిర్మల, మహేశ్‌ బాబు, నమృతా, వెంకటేశ్‌, సమంతా, గీత రచయితలు సిరివెన్నెల, అనంత శ్రీరాం, శ్రీకాంత్‌ అడ్డాల, చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు.

SVSC Platinum Disc 8“ఇంతకు ముందు ఎప్పడూ ఇలా అవ్వలేదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాకి వస్తున్న స్పందన చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగు తున్నాయి. గుండె బరువెక్కింది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను” అన్నారు మహేష్ బాబు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో చిన్నోడుగా ఆయన నటన అలరించింది. ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుక ఆదివారం సాయంత్రం శిల్ప కళా వేదికలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా మహేష్ పై విధంగా స్పందించారు. “ఈ సినిమా విజయం వెంకటేష్ దీ, నాదీ అంటున్నారు. కానీ ఇది అందరి కృషి. శ్రీకాంత్ అడ్డాల నాలుగేళ్ల పాటు ఈ కధతో ప్రయాణం చేశాడు.  దిల్ రాజు లాంటి ఓ మంచి నిర్మాత చేతిలో పడింది. మిక్కీ సంగీతం ప్రాణం పోసింది. ఈ సినిమా ఓ అరుదైన ఘట్టం” అన్నారు.

SVSC Platinum Disc 10వెంకటేష్ మాట్లాడుతూ “నిజజీవితం లో నేను కుడా పెద్దగా మాట్లాడను. అలాంటి పాత్రే ఈ సినిమాలో పోషించా. ఈ సినిమాతో నేను అన్నయ్యగా కుడా మారాను. మహేష్ తో కలసి నటించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది” అన్నారు. కృష్ణ మాట్లాడుతూ పదేళ్లకు ఒక్కసారి వచ్చే సినిమా ఇది.  వెంకటేష్, మహేష్ బాబులను చూస్తే ముచ్చట వేసింది. ఈ సినిమా అన్ని రికార్డులను తిరగ రాయాలి” అన్నారు.