ప్రియుడి తో నాగ్ హీరోయిన్ రొమాంటిక్ వర్క్ అవుట్స్..

లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. సినీ స్టార్స్ సైతం షూటింగ్ లు బంద్ కావడం తో వారికీ ఫుల్ రెస్ట్ దొరికినట్లు అయ్యింది. ఎప్పుడు షూటింగ్ లతో బిజీ గా గడిపే వీరు..ఇప్పుడు కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. మరికొంతమంది వంటిట్లో తమకు ఇష్టమైన వంటకాలు చేస్తూ బిజీ అవుతున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్.. మరోసారి ప్రియుడుతో కలిసి సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. ఈసారి అందరిలా రొటీన్‌ వర్క్ అవుట్ ఫోటోస్ కాకుండా కాస్త రోమాంటిక్‌గా ప్లాన్ చేసింది. తన బాయ్‌ ఫ్రెండ్ తో కలిసి చేసిన వర్క్‌ అవుట్ ఫోటోస్‌ ను తన ఇన్‌ స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసి రచ్చ లేపింది.

ప్రస్తుతం లాక్ డౌన్‌ సందర్భంగా వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరూ కలిసి వర్క్ అవుట్స్ కూడా చేస్తున్నారు. ఆ ఫోటోల్ని ఇన్ స్టా గ్రామ్‌లో సుస్మిత పోస్టు చేసింది. అంతేకాదు… కష్టకాలం ఎప్పటికీ ఉండదు. ఈ సమయంలో బలంగా ఉన్నవారే ఈ విపత్తును దాటగలరు అంటూ తనదైన స్టైల్లో వేదాంతాన్ని కూడా చెప్పింది. ఈ సమయంలో ప్రజలందనూ మానసికంగా శారీరకంగా ధృడంగా తయారు కావాలంటూ పిలుపునిచ్చింది.